Operation Sindoor: 'ఆప‌రేష‌న్ సిందూర్‌'పై అద్భుత‌మైన సైక‌త శిల్పం

Stunning Sand Art on Operation Sindhoor by Sudarsan Pattnaik
  • 'ఆప‌రేష‌న్ సిందూర్‌'పై ఒడిశాకు చెందిన ప్ర‌ముఖ సైక‌త శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ సైక‌త శిల్పం
  • పూరీ తీరంలో అద్భుత‌మైన సైక‌త శిల్పాన్ని మ‌లిచిన సైక‌త శిల్పి
  • ప్ర‌స్తుతం సైక‌త శిల్పం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
'ఆప‌రేష‌న్ సిందూర్‌'పై ఒడిశాకు చెందిన ప్ర‌ముఖ సైక‌త శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ రూపొందించిన‌ సైక‌త శిల్పం ఆక‌ట్టుకుంటోంది. ఆరు అడుగుల ఈ సైక‌త శిల్పంలో భరతమాత నుదుటి సింధూరం ఓ శక్తిగా మారి శత్రువును ఎలా నాశనం చేసిందో చూపించారు. పూరీ తీరంలో ఆయ‌న ఈ అద్భుతాన్ని మ‌లిచారు. 

"భార‌త్ మాతా కీ జై.. న్యాయం ల‌భించింది" అనే క్యాప్ష‌న్‌తో ఈ అద్భుత‌మైన సైక‌త శిల్పం వీడియోను ఆయ‌న త‌న అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ప్ర‌స్తుతం ఈ సైక‌త శిల్పం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతుండ‌గా.. నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు.

కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ బుధ‌వారం ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 

‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో ప్రతిదాడికి దిగి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేల‌మ‌ట్టం చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మంది వ‌ర‌కు ముష్క‌రులు మ‌ర‌ణించిన‌ట్లు ఈరోజు నిర్వ‌హించిన అఖిలప‌క్ష స‌మావేశంలో ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు.
Operation Sindoor
Sudarsan Pattnaik
Sand Art
Puri Beach
India Pakistan Conflict
Rajnath Singh
Jaish-e-Mohammed
Lashkar-e-Taiba
Hizbul Mujahideen
Viral Sand Art

More Telugu News