Bihar Youth Arrested: సోషల్ మీడియాలో ‘పాకిస్థాన్ జిందాబాద్’.. కటకటాల్లోకి యువకుడు

Bihar Youth Arrested for Pakistan Zindabad Post
  • బీహార్‌లోని జమయ్ జిల్లాలో ఘటన
  • ‘మిస్టర్ రాజా బాస్ 07’ ఐడీని నుంచి పోస్ట్
  • దేశ వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదన్న పోలీసులు
సామాజిక మాధ్యమాల్లో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన బీహార్‌లోని జమయ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ పెట్టిన ఓ కామెంట్‌పై పోలీసులు తక్షణమే స్పందించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ‘మిస్టర్ రాజా బాస్ 07’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నుంచి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని ఒక వ్యాఖ్య పోస్ట్ అయినట్లు పోలీసుల సోషల్ మీడియా సెల్ గుర్తించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన అధికారులు, సదరు ఐడీని ట్రాక్ చేయడం ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆ ఐడీని వినియోగిస్తున్న వ్యక్తిని గుర్తించారు.

పోలీసుల దర్యాప్తులో ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవల్ ఫరియాతా గ్రామానికి చెందిన ఓ యువకుడు నిర్వహిస్తున్నట్లు తేలింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, తదుపరి విచారణ చేపడుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.
Bihar Youth Arrested
Anti-India Slogan
Pakistan Zindabad
Social Media Post
Instagram Comment
Jamui District
Cyber Crime
National Security
Sedition
Arrest in Bihar

More Telugu News