PIB Fact Check: ఏటీఎంలు మూడు రోజులు మూత‌?... పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ!

PIB Debunks ATM Closure Hoax Three Day Shutdown Rumor is Fake News
  • భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌తల వేళ పుట్టుకొస్తున్న ేక్ న్యూస్‌లు
  • వాట్సాప్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న ఏటీఎంలు మూడు రోజుల‌పాటు మూసివేత వార్త‌
  • ఇందులో నిజంలేద‌ని స్ప‌ష్టం చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
  • ఏటీఎంలు ఎప్ప‌టిలాగానే ప‌నిచేస్తాయ‌ని వెల్ల‌డి
భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌ ప‌రిస్థితుల నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో కొన్ని ప్ర‌జ‌లను ఆందోళ‌న‌కు గురిచేసేలా ఉంటున్నాయి. ఇదేకోవ‌కు చెందిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. భార‌త్‌లో మూడు రోజుల పాటు ఏటీఎంలు మూత‌ప‌డ‌నున్నాయ‌నేది ఆ వార్త సారాంశం.

ర్యాన్స‌మ్‌వేర్ సైబ‌ర్‌ దాడి జ‌ర‌గొచ్చ‌ని, అందుకే రెండు నుంచి మూడు రోజుల‌పాటు దేశ‌వ్యాప్తంగా ఏటీఎంల‌ను మూసివేస్తున్న‌ట్లు ఆ న్యూస్ సారాంశం. ఈ మేర‌కు ఓ సందేశం ఇప్పుడు ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అయితే, దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి, క్లారిటీ ఇచ్చింది. అది పూర్తిగా న‌కిలీ న్యూస్ అని తేల్చేసింది. ఇందులో నిజంలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఏటీఎంలు ఎప్ప‌టిలాగానే ప‌నిచేస్తాయ‌ని వెల్ల‌డించింది. ఎవ‌రూ కూడా ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ను షేర్ చేయొద్ద‌ని, న‌మ్మ‌వ‌ద్ద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు సూచించింది. ఇందుకు సంబంధించి వాట్సాప్‌లో షేర్ అవుతున్న ఫేక్ మెసేజ్‌ను షేర్ చేసింది.
PIB Fact Check
ATM Closure Rumor
Fake News
WhatsApp Hoax
Cyber Attack
India ATM
Ransomware Attack
ATM Services
Social Media Hoax

More Telugu News