Ram Charan: చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం లాంచ్.. లండ‌న్‌లో చిరు, చెర్రీ సంద‌డి

Ram Charans Wax Statue Launch in London Creates a Buzz
  • ఈరోజు లండ‌న్‌లోని మేడం టుస్సాడ్స్ లో చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం లాంచ్ 
  • నాలుగు రోజుల కింద‌ లండ‌న్ చేరుకున్న మెగా ఫ్యామిలీ
  • తాజాగా విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కార్యక్ర‌మానికి హాజ‌రైన చిరు, చెర్రీకి మెగా ఫ్యాన్స్ ఘ‌న స్వాగ‌తం
మెగాస్టార్ చిరంజీవి, గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చ‌రణ్ ప్ర‌స్తుతం లండ‌న్‌లో సంద‌డి చేస్తున్నారు. ఇవాళ‌ రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఉండ‌గా, దీని కోసం నాలుగు రోజుల ముందే చ‌రణ్, చిరంజీవి, సురేఖ, ఉపాసన లండ‌న్‌కి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా లండన్ లో అభిమానులు మెగా ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికారు. 

ఇక‌, తాజాగా విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా లండన్‌లో మెగా అభిమానులు సందడి చేశారు. చిరు, చెర్రీలతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ‌న ద‌గ్గ‌రే కాదు విదేశాల‌లోనూ వీరి క్రేజ్ అదే స్థాయిలో ఉండ‌డంతో మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

కాగా, లండ‌న్‌లోని మేడం టుస్సాడ్స్ లో చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం లాంచ్ కావడం అరుదైన గౌరవం అని చెప్పాలి. ఈ విగ్రహాన్ని త్వరలోనే సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. శాశ్వతంగా అక్కడే ప్రదర్శనకు ఉంచుతారు. 

గ‌తంలో మ‌హేశ్ బాబు,  ప్ర‌భాస్, అల్లు అర్జున్ మైన‌పు బొమ్మ‌లు లాంచ్ కాగా, ఇప్పుడు ఆ జాబితాలో చెర్రీ కూడా చేరారు. ఇక‌, చరణ్ మైనపు విగ్రహం లాంచ్ అవుతుండ‌డ‌డంతో అభిమానులు సామాజిక మాధ్య‌మాల ద్వారా శుభాకాంక్ష‌లు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. 
Ram Charan
Chiranjeevi
London
Madame Tussauds
Wax Statue
Mega Family
Tollywood
Celebrity
Movie Star
Singapore

More Telugu News