Pakistan: పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత్ పై ఉపయోగించకూడదు... ఎందుకంటే!

- భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
- వైమానిక శక్తి కీలక పాత్ర అంచనా.
- పాక్ F-16 యుద్ధ విమానాల వినియోగంపై అమెరికా ఆంక్షలు
- కేవలం ఉగ్రవాద నిరోధానికే కేటాయింపు
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో, ఏ దేశ వైమానిక శక్తి పైచేయి సాధిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఘర్షణ ఎలాంటి మలుపు తిరిగినా, వైమానిక దళాలదే కీలక పాత్ర అని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.
వైమానిక బలాల పోలిక, F-16ల పరిమితులు
భారత వైమానిక దళం వద్ద 680కి పైగా యుద్ధ విమానాలుండగా, పాకిస్థాన్‌కు సుమారు 410 ఉన్నాయి. వీటిలో 75 అమెరికా తయారీ F-16 ఫైటర్ జెట్‌లు. వీటిని భారత్‌పై ఉపయోగించరాదని అమెరికా గతంలోనే స్పష్టమైన ఆంక్షలు విధించింది. ఉగ్రవాద నిరోధక చర్యలకే ఇవి కేటాయించబడ్డాయి, ఇతర దేశాలతో సంప్రదాయ యుద్ధానికి కాదని అమెరికా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ... ఈ ఎఫ్-16 జెట్ ఫైటర్లను భారత్ పై ఉపయోగిస్తే... పాక్ కు అమెరికా ఆ విమానాల విడిభాగాల సరఫరా, నిర్వహణ ఒప్పందాలు నిలిపివేస్తుంది. కాబట్టి పాక్ ఈ యుద్ధ విమానాల వినియోగంపై ఆచితూచి వ్యవహరించవచ్చు.
పాకిస్థాన్ ప్రత్యామ్నాయాలు
F-16లపై ఆంక్షల దృష్ట్యా, పాకిస్థాన్ చైనా నుంచి పొందిన J-10C విగోరస్ డ్రాగన్ విమానాలపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇవి చైనాకు చెందిన అత్యంత అధునాతన లాంగ్-రేంజ్ ఎయిర్ టు ఎయిర్ PL-15 క్షిపణులను కలిగి ఉంటాయి. వేగం, పరిధి రీత్యా వీటిని భారత రఫేల్‌కు పోటీగా పాక్ భావిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 25 నుంచి 30 వరకు J-10C విమానాలున్నాయని, వీటితో పాటు JF-17 బ్లాక్ III ఫైటర్లు కూడా ఆ దేశ వాయుసేనకు అందుబాటులో ఉన్నాయి.