Murali Nayak: అమర జవాన్ కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్ వ్యక్తిగత సాయం

- మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- జవాన్ కుటుంబానికి పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా రూ.25 లక్షల సాయం
- ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వెల్లడి
వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఆదివారం పవన్ కల్యాణ్ శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. మురళీనాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.