UP Gang Rape: యూపీలో దారుణం.. కారులో బాలికపై గ్యాంగ్ రేప్

UP Gang Rape Girl Raped in Moving Car And Woman Killed
  • కదులుతున్న కారులో నుంచి తోసేయడంతో మరో యువతి మృతి
  • లక్నోలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బాధితులను కారులో ఎక్కించుకున్న నిందితులు
  • మార్గమధ్యలో బాలికపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు నిందితుల అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిని, మరో బాలికను కారులో తీసుకెళ్లిన దుండగులు.. మార్గమధ్యలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న యువతిని కదులుతున్న కారులోంచి బయటకు తోసేశారు. దీంతో ఆ యువతి తీవ్రగాయాలపాలై మరణించింది. ఈ దారుణ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం గ్రేటర్ నోయిడాకు చెందిన సందీప్, అమిత్, ఘజియాబాద్ కు చెందిన గౌరవ్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ యువతిని, మరో బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని, లక్నోలో దింపుతామని నమ్మించి తమ కారులో ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో బీర్ తాగుతూ యువతితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మీరట్ జిల్లా సమీపంలో యువతిని కారులోంచి బయటకు తోసివేశారు. తీవ్రగాయాలపాలైన ఆమె ఆ తర్వాత మరణించింది.

అనంతరం కారులోనే బాలికపై ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బులంద్‌షహర్ జిల్లాలోని ఖుర్జా వద్ద బాలిక తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు అలీగఢ్-బులంద్‌షహర్ హైవేపై నిందితుల కారును అడ్డగించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గౌరవ్, సందీప్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లు, బుల్లెట్లు, ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనపై ఖుర్జా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
UP Gang Rape
Gang Rape in Car
Greater Noida Crime
Ghaziabad Crime
Mirzapur Crime
Bulandshahr Crime
Indian Crime News
UP Police
Sandeep
Amit
Gaurav

More Telugu News