Samantha: సమంతకు విషెస్ చెప్పిన రామ్ చరణ్

Ram Charan Wishes Samantha for Shubham Movie
  • ఈ నెల 9న విడుదలైన సమంత 'శుభం' మూవీ
  • సెలబ్రిటీల నుంచి సమంతకు మద్దతు
  • సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రామ్ చరణ్ ట్వీట్
  •  రామ్ చరణ్ శుభాకాంక్షలపై ఆనందం వ్యక్తం చేసిన సమంత 
నటి సమంత నిర్మాతగా మారి 'శుభం' అనే సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మే 9న విడుదలైంది. అయితే, ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. విమర్శకులు సినిమా బాగుందని ప్రశంసిస్తుండగా, ప్రేక్షకులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సమంతకు సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది.

తాజాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'శుభం' సినిమాపై ఎక్స్ వేదికగా స్పందించారు. సమంతను అభినందిస్తూ, "శుభం గురించి కుటుంబాల నుంచి మంచి విషయాలు వింటున్నాను. ట్రైలర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడటానికి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇలాంటి వినూత్నమైన, ఉత్తేజకరమైన చిత్రాలను మనమందరం ప్రోత్సహించాలి. సమంతకు నా శుభాకాంక్షలు. నిర్మాతగా ఇలాంటి శుభారంభం అందరికీ లభించదు. చిత్ర బృందానికి అభినందనలు" అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 

దీనిపై సమంత స్పందిస్తూ, రామ్ చరణ్ తన సినిమాకు శుభాకాంక్షలు తెలపడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. 
Samantha
Ram Charan
Shubham Movie
Samantha's Production
Tollywood
Telugu Cinema
Celebrity Support
Movie Review
X Platform Response
Film Industry

More Telugu News