Ricky Ponting: ఆస్ట్రేలియా వెళ్లాలని విమానం ఎక్కి... మళ్లీ మనసు మార్చుకున్న పాంటింగ్

Ricky Ponting Changes His Mind Stays in India Amidst Tensions
  • స్వదేశం వెళ్లేందుకు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కిన పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ 
  • విమానంలో ఉండగానే కాల్పుల విరమణకు సంబంధించి వెలువడిన కీలక ప్రకటన 
  • క్షణం ఆలస్యం చేయకుండా ఫ్లైట్ దిగిపోయి ఢిల్లీలోనే ఉండేందుకు నిర్ణయించుకున్న పాంటింగ్
  • ఇతర పీబీకేఎస్ జట్టు ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లకుండా నిలువరించిన పాంటింగ్
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ కారణంగా పలువురు విదేశీ క్రికెటర్లు, సహాయక సిబ్బంది వారి స్వస్థలాలకు పయనమయ్యారు.

ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ సైతం శనివారం ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ఎక్కారు. విమానం బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు కాల్పుల విరమణకు సంబంధించిన ప్రకటన వెలువడటంతో పాంటింగ్ వెంటనే విమానం దిగిపోయారు. ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

అంతేకాకుండా పంజాబ్ జట్టుకు చెందిన ఇతర విదేశీ ఆటగాళ్లను కూడా స్వదేశాలకు వెళ్లకుండా కాల్పుల విరమణ ఒప్పందం గురించి తెలియజేసి వారిని నిలువరించారు. వారంతా భారత్‌లోనే ఉండేలా చూశారు. అయితే, పంజాబ్ జట్టులో కీలక ఆటగాడైన మార్కో యాన్సెన్ (దక్షిణాఫ్రికా) మాత్రం దుబాయ్ మీదుగా తన స్వదేశానికి వెళ్లిపోయారు. 
Ricky Ponting
IPL 2025
India-Pakistan tensions
Punjab Kings
Cricket
Australia
Delhi Airport
International Cricketers
Flight
Head Coach

More Telugu News