Vijay Sethupathi: తన కుమార్తె పెళ్లికి విజయ్ సేతుపతి ఏవిధంగా సాయపడ్డాడో తెలిపిన దర్శకుడు అనురాగ్ కశ్యప్

Vijay Sethupathi Helped Anurag Kashyap For His Daughters Wedding
  • విజయ్ సేతుపతి ఒప్పించడం వల్లనే మహారాజ మూవీలో నటించానన్న అనురాగ్ కశ్యప్
  • అనుకోని కారణాల వల్ల దర్శకత్వం నుంచి నటనలోకి అడుగు పెట్టినట్లు వెల్లడి
  • మహారాజతో వచ్చిన డబ్బుతో కుమార్తె వివాహం చేశానన్న అనురాగ్ 
నిథిలన్ స్వామినాథన్ రూపొందించిన మహారాజ మూవీలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించగా, నటుడుగానూ రాణిస్తున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతి నాయకుడి లక్షణాలు ఉన్న పాత్రలో కనువిందు చేశారు. గత ఏడాది ఈ మూవీ విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఎంతో పేరు తెచ్చుకున్న అనురాగ్ దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుమార్తె వివాహానికి విజయ్ సేతుపతి ఏ విధంగా సాయపడ్డాడో అనురాగ్ వివరించారు. 

తనకు మంచి నటుడిని కాదనే అభిప్రాయం ఉండేదని, కానీ అనుకోని కారణాల వల్ల దర్శకత్వం నుంచి నటనలోకి అడుగు పెట్టానని తెలిపారు. ఇమైక్కా నొడిగల్ మూవీ తర్వాత దక్షిణాది నుంచి తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయన్నారు. అయితే నటనపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఆ ఆఫర్స్‌ను తిరస్కరించానని, అయినప్పటికీ అవకాశాలు రావడం మానలేదన్నారు. తను దర్శకత్వం వహిస్తున్న కెన్నడీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో భాగంగా ఒకసారి విజయ్ సేతుపతిని కలిశానని, ఆ తర్వాత తామిద్దరం తరచూ కలుసుకుని పలు విషయాలపై చర్చించుకునే వాళ్లమని అన్నారు. 

ఓసారి తన కుమార్తె వివాహ విషయంపై పెళ్లి ఖర్చుకు సరిపడా తన వద్ద డబ్బులు లేవని విజయ్ సేతుపతికి చెప్పగా, సాయం చేస్తామని హామీ ఇచ్చారని అంతే కాకుండా మహారాజ మూవీలో ఆఫర్ వస్తే తొలుత తాను తిరస్కరించానని, ఆ తర్వాత విజయ్ సేతుపతి చెప్పడంతో మూవీలో నటించానని చెప్పారు. ఆ మూవీ ద్వారా వచ్చిన డబ్బుతో కుమార్తె వివాహం చేశానని, ఆ విధంగా తన కుమార్తె పెళ్లి విషయంలో ఆయన నాకెంతో సాయం చేశాడని అనురాగ్ వివరించాడు. 
Vijay Sethupathi
Anurag Kashyap
Maharaj movie
Daughter's wedding
Bollywood director
South Indian cinema
Kennedy movie
Financial assistance
Tollywood
Kollywood

More Telugu News