Job Interview Rejection: బస్సులో వచ్చిందని ఉద్యోగం ఇవ్వలేదట.. ఇంటర్వ్యూలో ఓ యువతికి వింత అనుభవం

Job Interview Rejection Woman Rejected for Using Public Transport
  • తన జుట్టు రంగుపైనా కామెంట్ చేశారని యువతి ఆవేదన
  • అర్హతలు, సామర్థ్యం తెలుసుకునే ప్రయత్నమే చేయలేదని విమర్శ
  • పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడితే ఆఫీసుకు లేట్ గా వస్తారని బాస్ ఆరోపణ
  • రెడిట్‌లో వైరల్ గా మారిన యువతి పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం
జాబ్ ఇంటర్వ్యూలో సాధారణంగా అభ్యర్థుల నైపుణ్యాల గురించి, విద్యార్హతల గురించి, ప్రత్యేక సామర్థ్యాల గురించి అడుగుతుంటారు. సదరు పోస్టుకు సరిపోతారా లేదా, బాధ్యతలు నిర్వహించే సామర్థ్యం ఉందా లేదా అనేది అంచనా వేస్తారు. దానిని బట్టి ఉద్యోగం ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. కానీ తనకు మాత్రం వింత అనుభవం ఎదురైందని ఓ యువతి ప్రముఖ సామాజిక మాధ్యమం రెడిట్ లో పోస్ట్ చేసింది. ఇంటర్వ్యూ కోసం బస్ లో వెళ్లడంతో బాస్ తనను రిజెక్ట్ చేశాడని ఆరోపించారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించే వాళ్లు ఆఫీసుకు సమయానికి రారని, అలాంటి వారికి తాను ఉద్యోగం ఇవ్వలేనని చెప్పారన్నారు.

ఇంటర్వ్యూ కోసం ఆ కంపెనీ సమీపంలోని బస్ స్టాప్ లో దిగి నడుచుకుంటూ ఆఫీసులోకి వెళ్లానని యువతి చెప్పారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ విషయం గమనించినట్లు హైరింగ్ మేనేజర్ చెప్పారన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ ఉపయోగించే వారిని తాను ఉద్యోగంలోకి తీసుకోనని, అలాంటి వారు సమయానికి రారని ఆయన వ్యాఖ్యానించినట్లు వివరించారు. ఆ తర్వాత తన జుట్టు రంగు "అన్‌ప్రొఫెషనల్‌గా" ఉందని కూడా విమర్శించారని ఆ యువతి ఆరోపించారు.

తన అర్హతలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే తనను రిజెక్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. "పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో రోజూ లక్షలాది మంది ప్రయాణిస్తారు, అది నమ్మకానికి ఎలా కొలమానం అవుతుంది?" అని కొందరు ప్రశ్నించగా, "ఉద్యోగానికి కారు అవసరం లేనప్పుడు, రవాణా విధానం అప్రస్తుతం" అని మరికొందరు వ్యాఖ్యానించారు. మేనేజర్ వైఖరిని తప్పుబడుతూ, ఇలాంటి పాతకాలపు పక్షపాత ధోరణులు ఇంకా ఉన్నాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Job Interview Rejection
Public Transport
Hiring Manager Bias
Reddit Post
Young Woman
Unprofessional Hair
Discrimination
Job Application
Interview Experience
Workplace Inequality

More Telugu News