Virat Kohli: కోహ్లీ ఎందుకిలా చేశావ్‌?.. మాజీల ఆశ్చ‌ర్యం!

Virat Kohli Announces Test Cricket Retirement
  • టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లికిన విరాట్‌
  • ఇన్‌స్టా వేదిక‌గా భావోద్వేగ‌పూరిత పోస్టు
  • 'ఎందుకు రిటైర్ అయ్యావ్ కోహ్లీ?' అంటూ ప్ర‌శ్నించిన భ‌జ్జీ
  • 'కోహ్లీ ఏంటీ నిర్ణ‌యం?' అని అర్థం వ‌చ్చేలా కెవిన్ పీట‌ర్స‌న్ ట్వీట్‌
టీమిండియా స్టార్ బ్యాట‌ర్‌ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌రికీ షాకిచ్చాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌న్ మెషీన్ లాంగ్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేర‌కు త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ‌పూరిత పోస్టును పెట్టాడు. 

టెస్టు క్రికెట్‌లో దేశం త‌ర‌పున అరంగేట్రం చేసి 14 ఏళ్లు ఆడ‌డం ఎంతో గొప్ప విష‌య‌మ‌ని కోహ్లీ పేర్కొన్నాడు. టెస్టు ఫార్మాట్ త‌న‌కు ఎంతో నేర్పింద‌ని తెలిపాడు. త‌న‌ను ప‌రీక్షించింద‌ని, త‌నను తీర్చిదిద్దింద‌ని, జీవితానికి కావాల్సిన ఎన్నో పాఠాలు నేర్పిందని పేర్కొన్నాడు.

కాగా, కింగ్ కోహ్లీ టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంపై మాజీ ప్లేయ‌ర్లు ఆశ్చ‌ర్యం వ్యక్తం చేశారు. "ఎందుకు రిటైర్ అయ్యావ్ కోహ్లీ?" అంటూ టీమిండియా లెజెండ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌శ్నించాడు. అలాగే ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ కూడా విరాట్ షాకింగ్‌ వీడ్కోలుపై స్పందించాడు. "కోహ్లీ ఏంటీ నిర్ణ‌యం?" అని అర్థం వ‌చ్చేలా 'ఎక్స్' పోస్టు చేశాడు.  

ఇక‌, కోహ్లీ టీమిండియా త‌ర‌ఫున‌ 123 టెస్టుల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇందులో 68 మ్యాచ్‌ల‌కు అత‌ను కెప్టెన్‌గా ఉన్నాడు. 46.85 బ్యాటింగ్ స‌గ‌టుతో అత‌ను 9,230 ప‌రుగులు చేశాడు. ఇందులో 30 సెంచ‌రీలు, 31 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 

కాగా, గ‌త కొన్ని రోజుల నుంచి కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. రోహిత్ త‌ర‌హాలోనే టెస్టు నుంచి త‌ప్పుకునేందుకు కోహ్లీ సిద్దంగా ఉన్న‌ట్లు వార్త‌లు కూడా వెలువ‌డ్డాయి. అన్న‌ట్టుగానే ర‌న్ మెషీన్ లాంగ్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లికాడు. 


Virat Kohli
Test Cricket
Retirement
Team India
Harbhajan Singh
Kevin Pietersen
Cricket News
Kohli Retires
Indian Cricket

More Telugu News