Narendra Modi: ఈ మధ్యాహ్నం జరగాల్సిన హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి వాయిదా... మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతుల సమావేశం

India Pakistan Hotline Talks Postponed Modi Holds Key Meeting with Military Chiefs
  • భారత్-పాక్ మధ్య చల్లారుతున్న ఉద్రిక్తతలు
  • ఇటీవల కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం
  • ఒప్పందం కొనసాగింపునకు నేడు హాట్ లైన్ లో భారత్-పాక్ చర్చలు
  • చర్చలు జరపనున్న ఇరుదేశాల డీజీఎంఓలు
భారత-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయి. కాగా, కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కొనసాగింపునకు ఈ మధ్యాహ్నం జరగాల్సిన భారత్-పాక్ డీజీఎంఓల హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. వాయిదాకు గల కారణాలు వెల్లడి కాలేదు. ఈ చర్చలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఎలాంటి షరతులకు లొంగేది లేదని భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తుండగా, పాకిస్థాన్ ఏంచెబుతోందనన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. 

అటు, దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నివాసంలో మరో కీలక భేటీ జరుగుతోంది. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
Narendra Modi
India-Pakistan
DGMO talks
Hotline discussions
Rajnath Singh
Anil Chauhan
Ajit Doval
Military Chiefs Meeting
Indo-Pak tensions
Ceasefire agreement

More Telugu News