Virat Kohli: కోహ్లీ.. లార్డ్స్ లో నీ ప్రసంగమే అందుకు నిదర్శనం: జై షా

Virat Kohli Retirement ICC Chairman Praises His Test Career
  • టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ 
  • అద్భుత టెస్ట్ కెరీర్‌ అంటూ అభినందించిన ఐసీసీ చైర్మన్ జై షా 
  • టీ20 యుగంలోనూ టెస్టులకు కోహ్లీ ప్రాధాన్యత ఇచ్చాడని కితాబు
  • క్రమశిక్షణ, ఫిట్‌నెస్, నిబద్ధతలో ఆదర్శంగా నిలిచాడని వెల్లడి
టీమిండియా మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై ఐసీసీ చైర్మన్ జై షా స్పందించారు. కోహ్లీ అద్భుతమైన ప్రస్థానంపై ప్రశంసల వర్షం కురిపించారు. టీ20 ఫార్మాట్ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో కూడా, సంప్రదాయ టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ అత్యంత ప్రాధాన్యతనిస్తూ, దాని గౌరవాన్ని నిలబెట్టాడని కొనియాడారు.

"విరాట్ కోహ్లీ, నీ అద్భుతమైన టెస్ట్ కెరీర్‌కు అభినందనలు. టీ20 క్రికెట్ ప్రాబల్యం పెరుగుతున్న ఈ తరుణంలో, క్రికెట్‌లోని అత్యంత స్వచ్ఛమైన ఫార్మాట్ అయిన టెస్టులకు మీరు ప్రాధాన్యతనిచ్చినందుకు ధన్యవాదాలు" అని జై షా పేర్కొన్నారు. ఆటగాడిగా క్రమశిక్షణ, అత్యున్నత ఫిట్‌నెస్ ప్రమాణాలు, అంకితభావం వంటి విషయాల్లో కోహ్లీ ఒక అసాధారణమైన ఆదర్శాన్ని నెలకొల్పాడని అభినందించారు.

లార్డ్స్ మైదానంలో కోహ్లీ చేసిన ప్రసంగాన్ని కూడా జై షా గుర్తుచేసుకున్నారు. "లార్డ్స్‌లో నీ ప్రసంగం అన్ని విషయాలను స్పష్టం చేసింది. నువ్వు టెస్ట్ మ్యాచ్‌లను ఎంతటి హృదయపూర్వకంగా, పట్టుదలతో, గర్వంతో ఆడావో ఆ ప్రసంగం తెలియజేసింది" అని జై షా వివరించారు. కోహ్లీ తన ఆటతీరుతో టెస్ట్ క్రికెట్‌కు మరింత వన్నె తీసుకువచ్చాడని, ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడని జై షా అభిప్రాయపడ్డారు. 
Virat Kohli
Test Cricket
Retirement
ICC Chairman Jay Shah
Lords Speech
Indian Cricket
Kohli's Career
Cricket Legend
Team India

More Telugu News