Ram Charan: లండన్ లో రామ్ చరణ్ మేనియా... ఫొటోలు ఇవిగో!

Ram Charan Mania Takes Over London
 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహావిష్కరణ కొన్నిరోజుల కిందటే అట్టహాసంగా జరిగింది. రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో గత కొన్నిరోజులుగా లండన్ లోని తెలుగు సమాజంలో సందడి వాతావరణం నెలకొంది. 

లండన్ లో రామ్ చరణ్ మేనియా కొట్టొచ్చినట్టు కనపడింది. ఆఖరికి చరణ్ పెంపుడు శునకం రైమ్ కు కూడా అభిమానులు ఏర్పడ్డారంటే అతిశయోక్తి కాదు. రైమ్ పేరిట ప్లకార్డులు పట్టుకున్న అభిమానులు లండన్ లో సందడి చేశారు. ఇక, అభిమానులను నిరాశపరచకుండా రామ్ చరణ్ కారు సన్ రూఫ్ నుంచి అందరికీ అభివాదం  చేసి ఆనందం కలిగించారు. ఫ్యాన్స్ సంగీత వాద్యాలతో లండన్ వీధులను హోరెత్తించారు.
Ram Charan
London
Madame Tussauds
Chiranjeevi
Upasana
Mega Family
RRR
Tollywood
Telugu Cinema
Ram Charan Wax Statue

More Telugu News