Narendra Modi: ఈరోజు రాత్రి 8 గంటలకు జాతికి ప్రధాని నరేంద్ర మోదీ సందేశం!

PM Modis Nation Address Tonight at 8 PM
  • పాక్‌తో ఒప్పందం అనంతరం.. జాతిని ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం
  • 'ఆపరేషన్ సిందూర్' తర్వాత తొలిసారి ప్రధాని ప్రసంగం
  • పహల్గామ్ దాడికి ప్రతిగా మే 7న భారత బలగాల 'ఆపరేషన్ సిందూర్'
  • రెండు రోజుల క్రితం భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇటీవల భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా పూర్తి చేయడం, ఆ తర్వాత పాకిస్థాన్‌తో కీలక కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆపరేషన్ అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి.

గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత సాయుధ బలగాలు 'ఆపరేషన్ సిందూర్' పేరిట ఈ నెల 7వ తేదీన ప్రతిచర్యకు దిగాయి. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్ భూభాగం, పీఓకేలలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిక్షణా శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ సైనిక చర్యలో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

ఈ 'ఆపరేషన్ సిందూర్' ముగిసిన అనంతరం, రెండు రోజుల క్రితం, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల ద్వారా ఎలాంటి సైనిక దాడులకు పాల్పడరాదని, కాల్పుల విరమణ పాటించాలని ఇరు దేశాలు పరస్పరం అంగీకారానికి వచ్చాయి. ఈ శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు.
Narendra Modi
India
Pakistan
Operation Sundar
ceasefire agreement
national address
Pulwama attack
terrorism
Indo-Pak relations

More Telugu News