Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందన

Telangana CM Revanth Reddy on Virat Kohlis Retirement
  • టెస్ట్ క్రికెట్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీడ్కోలు
  • కోహ్లీ నాయకత్వం, క్రమశిక్షణ, వారసత్వంపై ప్రశంసలు
  • భారత క్రీడా చరిత్రలో కోహ్లీది గొప్ప అధ్యాయమన్న రేవంత్ రెడ్డి
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భారత క్రికెట్ చరిత్ర పుటల్లో విరాట్ కోహ్లీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. అద్భుతమైన క్రీడా వారసత్వాన్ని కోహ్లీ విజయవంతంగా కొనసాగించాడని ప్రశంసించారు.

ఆట పట్ల అంకితభావం, అత్యున్నత క్రమశిక్షణతో ఎన్నో రికార్డులు నెలకొల్పి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు. టెస్టు క్రికెట్ నుంచి వైదొలగినప్పటికీ, మిగిలిన ఫార్మాట్లలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు, అభిమానులు కోహ్లీ క్రీడా జీవితాన్ని, నాయకత్వ పటిమను కొనియాడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Virat Kohli
Retirement
Test Cricket
Telangana CM
Revanth Reddy
Indian Cricket
Kohli's Legacy
Cricket News
Sports News

More Telugu News