Rakesh Poojari: కాంతార నటుడి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హీరో రిషబ్ శెట్టి

Kantara 2 Actor Rakesh Poojari Passes Away
  • గుండె పోటుతో కాంతార నటుడు రాకేశ్ పూజారి మృతి
  • రాకేశ్ మృతి పట్ల భావోద్వేగ పోస్టు పెట్టిన కాంతార హీరో రిషబ్ శెట్టి
  • రాకేశ్ లేని లోటు మరొకరు తీర్చలేరన్న రిషబ్
నటుడు రాకేశ్ పూజారి (34) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. రాకేశ్ 'కామెడీ ఖిలాడిగలు' సీజన్ 3లో విజేతగా నిలిచి మంచి గుర్తింపు పొందారు. కన్నడ, తుళు భాషల్లో పలు చిత్రాలలో ఆయన నటించారు. కాంతార 2 చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఆయన ఇటీవలే పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

రాకేశ్ మృతి పట్ల కాంతార 2 హీరో రిషబ్ శెట్టి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

"మిత్రమా.. మళ్లీ జన్మించు" అంటూ నటుడు రిషబ్ శెట్టి భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. కాంతారలో నీ పాత్ర, ఆ పాత్రలో నటించే క్రమంలో నీ ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటాయి. నీ లోటు ఎవరూ తీర్చలేనిది" అంటూ రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్ ద్వారా రాకేశ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. 
Rakesh Poojari
Kantara 2
Rishab Shetty
Death
Actor
Karnataka
Tulu Cinema
Kannada Cinema
Homebale Films
Comedy Khiladigalu

More Telugu News