Pawan Kalyan: పాక్ ను ఎలుకతో పోల్చిన పవన్ కల్యాణ్.. వైరల్ ట్వీట్ ఇదిగో!

Pawan Kalyans Interesting Tweet Comparing Pakistan to a Mouse
--
భారత్, పాక్ ల మధ్య మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. పాక్ ను ఎలుకతో, భారత్ ను శేషనాగుతో ఆయన పోల్చారు. పాకిస్థాన్ వక్రబుద్ధిని తిరువళ్లువార్ తిరుక్కురల్ లోని ఓ పద్యంతో విమర్శించారు.

తమిళ కవి తిరువళ్లువార్ రచించిన తిరుక్కురల్ గ్రంథంలోని పద్యాన్ని పవన్ తన ట్వీట్ లో ప్రస్తావించారు. ‘‘ఎలుకలన్నీ జేరి సముద్రము వలే ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది..? శేషనాగు ఒక్క హుంకారం చేయగానే అవన్నీ నశిస్తాయి’’ అని చెప్పారు. తన ట్వీట్ లో ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన ఫొటోను జతచేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pawan Kalyan
AP Deputy CM
Pakistan
India
Tweet
Tirukkural
S400 Air Defence System
Viral Tweet
India-Pakistan Relations
Social Media

More Telugu News