Alia Bhatt: ఇండియ‌న్ ఆర్మీపై అలియా భట్ భావోద్వేగ‌పూరిత‌ పోస్ట్

Alia Bhatts Emotional Post on Indian Army Goes Viral
  • భారత్, పాక్‌ ఉద్రిక్తతలు స‌ద్దుమ‌ణిగిన నేప‌థ్యంలో బాలీవుడ్ నటి పోస్ట్‌ 
  • ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుంద‌న్న అలియా
  • అలియా ఎమోష‌న‌ల్‌ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు స‌ద్దుమ‌ణిగిన నేప‌థ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ భార‌త‌ ఆర్మీని ఉద్దేశించి త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్ర‌త్యేక పోస్ట్ పెట్టారు. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందని అలియా పెట్టిన ఈ భావోద్వేగ‌పూరిత‌ పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  

"గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశ‌కోసం మ‌న‌కోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.

మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డ‌ర్‌లో ఉన్న ప్ర‌జ‌లు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని త‌న త‌ల్లికి తెలుస్తుంది" అంటూ అలియా త‌న ఇన్‌స్టా స్టోరీలో ఎమోష‌న‌ల్‌గా రాసుకొచ్చారు.
Alia Bhatt
Indian Army
Emotional Post
Instagram Post
Bollywood Actress
India Pakistan Tension
Viral Post
Social Media
Military
Tribute
  • Loading...

More Telugu News