Pakistan: ఫేక్ వార్తల ఫ్యాక్టరీగా పాకిస్థాన్.. నేవీ డ్రిల్స్ ఫొటోను తాజా యుద్ధానికి ముడిపెట్టిన వైనం

Pakistans Fake News Factory Navy Drills Photo Used for False War Narrative
  • భారత నౌకాదళాన్ని కట్టడి చేయడానికి యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లను మోహరించామంటూ ప్రచారం
  • డీజీ ఐఎస్ పీఆర్ ప్రెస్ మీట్ లో వీడియో ప్రెజెంటేషన్
  • ఆ ఫొటో 2023లో చైనా-పాక్ నౌకాదళ విన్యాసాల చిత్రమని తేల్చిన మీడియా
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాత ఫొటోలను ఎడిట్ చేసి తన ప్రజలను, ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. స్వయంగా సైనిక ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫేక్ ఫొటోలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇది నమ్మి పాక్ ప్రజలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. పాక్ తప్పుడు ప్రచారాన్ని ఆ దేశ ప్రజలు నమ్మారు కానీ ప్రపంచం నమ్మలేదు. సోషల్ మీడియా యుగంలో ఫేక్ వార్తల గుట్టు రట్టుచేయడం ఎంతసేపు.. ఫ్యాక్ట్ చెక్ పేరుతో పలు మీడియా సంస్థలు, సోషల్ మీడియా యూజర్లు పాక్ కుటిల నీతిని ఎప్పటికప్పుడు బయటపెట్టారు. ఇటీవల పాక్ డీజీ ఐఎస్ పీఆర్ ప్రెస్ మీట్ లో ఆ దేశ నేవీ అధికారి చూపించిన చిత్రం గుట్టును తాజాగా ఓ నెటిజన్ బట్టబయలు చేశారు.

అసలేం జరిగిందంటే..
భారత నౌకా దళాన్ని కట్టడి చేసేందుకు తమ యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను, సబ్ మెరైన్లను సముద్రంలో వేగంగా మోహరించామని పాక్ నేవీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇదేనంటూ ఓ చిత్రాన్ని ప్రదర్శించారు. అందులో.. మూడు యుద్ధ నౌకలు వాటిపై ఎగురుతున్న మూడు నిఘా విమానాలు, నౌకల పక్కనే ఓ సబ్ మెరైన్ కనిపిస్తున్నాయి. అయితే, పాక్ కు అంత సీన్ లేదని, ఈ ఫొటో ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిందని నెటిజన్లు క్రాస్ చెక్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ లో.. ఈ ఫొటో 2023లో చైనాతో కలిసి పాకిస్థాన్ హిందూ మహాసముద్రంలో నౌకాదళ విన్యాసాలు చేపట్టిన నాటి ఫొటో అని తేలింది. బీజింగ్‌-ఇస్లామాబాద్‌కు చెందిన యుద్ధ నౌకలు పెట్రోలింగ్‌ ఫార్మేషన్‌గా ఏర్పడినవి. వాటిపైన ఎగురుతున్న లాక్‌ హీడ్‌మార్టిన్‌ సంస్థ తయారుచేసిన పీ-3సీ ఓరియన్‌ విమానాలు అని బయటపడింది. ఈ ఫొటోను కాస్త ఎడిట్ చేసి ఓ సబ్ మెరైన్ చిత్రాన్ని జోడించి మీడియా ముందు ప్రదర్శించారని నెటిజన్లు చెబుతున్నారు.

ఒరిజినల్ ఫొటో ఇదే..
Pakistan
Fake News
Misinformation
Naval Drills
Operation Sindhoor
India-Pakistan Relations
Fact Check
Social Media
China
Military

More Telugu News