Govindappa Balaji: ఏపీ మద్యం కుంభకోణం నిందితుడు బాలాజీ అరెస్ట్

Key Accused in AP Liquor Scam Arrested in Mysore
--
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితులలో ఒకరైన గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో బాలాజీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మైసూరు నుంచి ట్రాన్సిట్ వారెంట్ తో బాలాజీని విజయవాడకు తరలిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. భారతి సిమెంట్స్ కంపెనీలో గోవిందప్ప బాలాజీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కాగా, బాలాజీ అరెస్టుతో మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఐదుకు చేరింది.
Govindappa Balaji
AP Liquor Scam
SIT Arrest
Mysore Arrest
Vijayawada
Bharati Cements
Liquor Case Accused
Andhra Pradesh
Crime Investigation

More Telugu News