South Africa: డ‌బ్ల్యూటీసీ ఫైనల్ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించిన ద‌క్షిణాఫ్రికా

South Africa Announces Squad for WTC Final
  • ఆస్ట్రేలియాతో డ‌బ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్
  • 15 మంది సభ్యులతో జ‌ట్టును అనౌన్స్ చేసిన సౌతాఫ్రికా
  • ఇప్ప‌టికే జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆసీస్
  • జూన్ 11 నుంచి 15 వరకు లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైన‌ల్ పోరు 
ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)-2025 ఫైనల్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించగా... తాజాగా ద‌క్షిణాఫ్రికా కూడా త‌మ తమ 15 మంది సభ్యులతో కూడిన‌ జ‌ట్టును అనౌన్స్ చేసింది. గాయం కార‌ణంగా చాలా కాలంగా టెస్టు జట్టుకు దూర‌మైన లుంగి ఎంగిడి తిరిగి టీమ్‌లోకి చేర‌డం స‌ఫారీల‌కు క‌లిసొచ్చే అంశం. 

ఇక‌, తాజాగా సౌతాఫ్రికా ప్ర‌క‌టించిన జ‌ట్టు బ్యాటర్లు, బౌల‌ర్లు, ఆల్‌రౌండ‌ర్ల‌తో స‌మ‌తుకంగా క‌నిపిస్తోంది. డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, మార్క్రమ్ ల‌తో ద‌క్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైన‌ప్ దుర్భేద్యంగా ఉంటే...  ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, బ‌వుమాల‌తో మిడిల్ ఆర్డర్ కూడా అంతే స్ట్రాంగ్‌గా క‌నిపిస్తోంది.

లోయ‌ర్ మిడిల్ ఆర్డ‌ర్‌లో కైల్ వెర్రెయిన్, ఆల్ రౌండర్లు వియాన్ ముల్డర్, మార్కో యన్సెన్ కూడా బ్యాట్‌తో రాణించ‌గ‌ల‌రు. ముల్డర్, జాన్సెన్‌లతో పాటు పేసర్ కగిసో రబాడ, లుంగి ఎంగిడి, డేన్ పాటర్సన్, కార్బిన్ బాష్ లతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం బ‌లంగా ఉంది. అలాగే నాణ్య‌మైన‌ స్పిన్న‌ర్లు కేశవ్ మహారాజ్, సెనురాన్ ముత్తుసామి జ‌ట్టులో ఉన్నారు. 

ఇలా అన్ని విభాగాలు బ‌లంగా ఉండేలా ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్క్వాడ్ ను ఎంపిక చేయ‌డం విశేషం. కాగా, జూన్‌ 11 నుంచి 15 వరకు లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇరు జ‌ట్లు డ‌బ్ల్యూటీసీ టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. 

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ద‌క్షిణాఫ్రికా జట్టు: టెంబా బ‌వుమా (కెప్టెన్‌), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో యన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, సెనురన్ ముత్తుసామీ, డేన్ పాటర్సన్

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కున్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్
South Africa
WTC Final 2025
Australia vs South Africa
Lungi Ngidi
Temba Bavuma
Kagiso Rabada
Keshav Maharaj
Lord's Cricket Ground
WTC Final Squad
Cricket

More Telugu News