TTD: తిరుమ‌ల‌లో వీఐపీ సిఫార్సు లేఖ‌ల స్వీక‌ర‌ణ‌పై మంత్రి ఆనం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Minister Annams Key Announcement on VIP Recommendations in Tirumala
  • ఎల్లుండి నుంచి వీఐపీ సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రిస్తామ‌న్న మంత్రి 
  • తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌పై ఎల్లుండి నుంచి బ్రేక్ ద‌ర్శ‌నాలు 
  • గ‌తంలో మే 1 నుంచి జులై 15 వ‌ర‌కు సిఫార‌సు లేఖ‌ల బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • ఇప్పుడు ఆ గ‌డువును త‌గ్గించిన టీటీడీ
తిరుమ‌ల‌లో ఈ నెల 15 (గురువారం) నుంచి వీఐపీ సిఫార‌సు లేఖ‌లను స్వీక‌రిస్తామ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ‌ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార‌సు లేఖ‌ల‌పై ఎల్లుండి నుంచి బ్రేక్ ద‌ర్శ‌నాలు ఉంటాయ‌ని మంత్రి ప్ర‌క‌టించారు.  

కాగా, మే 1 నుంచి జులై 15 వ‌ర‌కు సిఫార‌సు లేఖ‌ల బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తున్న‌ట్లు గ‌తంలో టీటీడీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. టీటీడీ బోర్డు స‌భ్యులు, ప్ర‌జాప్ర‌తినిధుల సిఫారసు లేఖ‌లు చెల్ల‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ప్రోటోకాల్ వీఐపీల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నాలు ఉంటాయ‌ని చెప్పింది. 

వేస‌వి సెల‌వులను దృష్టిలో పెట్టుకుని భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అప్పుడు టీటీడీ వెల్ల‌డించింది. అయితే, ఇప్పుడు ఆ గ‌డువును త‌గ్గించి మే 15వ తేదీ నుంచే ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార‌సు లేఖ‌ల‌ను స్వీక‌రిస్తామ‌ని మంత్రి ఆనం రామనారాయ‌ణ రెడ్డి తెలిపారు.    
TTD
Anam Ramanarayana Reddy
Tirumala
VIP recommendation letters
Break Darshan
Andhra Pradesh
Telangana
AP
TG
Pilgrimage

More Telugu News