Bellankonda Srinivas: హైదరాబాద్‌లో రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన టాలీవుడ్ హీరో!... అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

Tollywood Hero Bellankonda Srinivas Caught Driving on Wrong Route in Hyderabad
  • జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన ఘటన
  • రాంగ్ రూట్‌లో కారు నడిపిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్
  • ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపడంతో వెనుదిరిగిన నటుడు
టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వార్తల్లో నిలిచారు. ఆయన రాంగ్ రూట్‌లో కారు నడుపుతూ పోలీసులకు చిక్కడం, ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ స్వయంగా తన కారును నడుపుకుంటూ రాంగ్ రూట్‌లో దూసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్, నిబంధనలకు విరుద్ధంగా వస్తున్న కారును గమనించి వెంటనే అడ్డుకున్నారు.

కానిస్టేబుల్, కారు నడుపుతున్నది హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అని గుర్తించి, రాంగ్ రూట్‌లో ఎందుకు ప్రయాణిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో శ్రీనివాస్ తన వాహనాన్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Bellankonda Srinivas
Tollywood Actor
Traffic Violation
Hyderabad
Wrong Route Driving
Jubilee Hills

More Telugu News