Sunil Gavaskar: ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్ లలో డీజేలు, చీర్ లీడర్స్ వద్దు: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar Wants No DJs Cheerleaders in IPL
  • భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా వారం రోజులు నిలిచిన ఐపీఎల్ 
  • మే 17న ఐపీఎల్ పునఃప్రారంభం
  • ఉగ్రదాడి మృతులకు గౌరవంగా మిగిలిన మ్యాచ్‌లలో ఆర్భాటాలు, సంగీతం వద్దని గవాస్కర్ సూచన
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వారం రోజుల పాటు నిలిచిపోయిన ఐపీఎల్ 2025 సీజన్, మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ కీలక తరుణంలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ఐపీఎల్ 2025ను మే 9న తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. వారం రోజుల విరామం అనంతరం, మే 17న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది. లీగ్ ఫైనల్ జూన్ 3న జరగనుంది.

ఈ నేపథ్యంలో, భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడిలో మరణించిన వారి కుటుంబాల మనోభావాలను గౌరవిస్తూ, మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లలో ఎలాంటి ఆర్భాటాలు, హంగామా ఉండకూడదని ఆయన సూచించారు.

"ఇప్పటికే సుమారు 60 మ్యాచ్‌లు జరిగాయి. చివరి 15-16 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇటీవల జరిగిన విషాద ఘటనల నేపథ్యంలో కొందరు తమ ఆత్మీయులను కోల్పోయారు కాబట్టి, ఐపీఎల్‌తో ముడిపడి ఉన్న ఆర్భాటాలు, షోలు ఏవీ ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం ఆట మాత్రమే జరగాలి. ప్రేక్షకులు ఉండొచ్చు కానీ సంగీతం, ఓవర్ మధ్యలో డీజేల అరుపులు వంటివి వద్దు" అని గవాస్కర్ అన్నారు. "డ్యాన్సింగ్ గర్ల్స్, ఇతర వినోద కార్యక్రమాలు ఏవీ లేకుండా, కేవలం క్రికెట్ మాత్రమే నిర్వహిస్తే, మృతుల కుటుంబాల మనోభావాలను గౌరవించినట్లు అవుతుంది" అని ఆయన వివరించారు.
Sunil Gavaskar
IPL 2025
IPL matches
Cricket
India Pakistan Tension
No DJs in IPL
No Cheerleaders in IPL
Pahlgam Attack
Sports

More Telugu News