Revanth Reddy: ప్రపంచ సుందరీమణుల విందు కార్యక్రమంలో పక్క పక్కనే రేవంత్ రెడ్డి, నాగార్జున

Revanth Reddy Nagarjuna dine with Miss World 2025 contestants
  • చౌమహల్లా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వం విందు
  • హైదరాబాదీ వంటకాలతో ఆస్వాదించిన ప్రపంచ సుందరీమణులు
  • విందుకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు
ప్రపంచ సుందరి - 2025 పోటీదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిచ్చింది. నగరంలోని చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్‌లో వీరికి ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సతీమణితో కలిసి హాజరయ్యారు.

పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ విందులో పాల్గొన్నారు. చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించిన అనంతరం ప్రపంచ సుందరీమణులు పసందైన హైదరాబాదీ వంటకాలతో విందును ఆస్వాదించారు. ఈ విందుకు ప్రముఖ సినీ నటుడు నాగార్జున కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాగార్జున ఒకే టేబుల్ వద్ద కూర్చున్నారు.
Revanth Reddy
Nagarkjuna
Miss World 2025
Telangana Government
Chowmahalla Palace
Hyderabad
Dinner
Celebrities

More Telugu News