Ajay Kumar: యూపీఎస్సీ ఛైర్మ‌న్‌గా అజ‌య్ కుమార్

Ajay Kumar Appointed as UPSC Chairman
  • ప్రీతి సుద‌న్ స్థానంలో కొత్త యూపీఎస్సీ ఛైర్మ‌న్‌గా అజ‌య్ కుమార్‌
  • ఆయ‌న నియామ‌కానికి రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము ఆమోదం
  • 1985 నాటి ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కేర‌ళ క్యాడ‌ర్‌ అధికారి
  • ఇంతకుముందు ర‌క్ష‌ణ శాఖ కార్య‌ద‌ర్శిగా విధులు
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ (UPSC) ఛైర్మ‌న్‌గా ర‌క్ష‌ణ శాఖ మాజీ కార్య‌ద‌ర్శి అజ‌య్ కుమార్‌ను కేంద్రం నియ‌మించింది. ఏప్రిల్ 29న ప్రీతి సుద‌న్ ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత‌ యూపీఎస్సీ ఛైర్మ‌న్‌ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో తాజాగా అజ‌య్ కుమార్‌ను యూపీఎస్సీ ఛైర్మ‌న్‌గా నియ‌మిస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయ‌న నియామ‌కాన్ని రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు.

1985 నాటి ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అజ‌య్ కుమార్‌ది కేర‌ళ క్యాడ‌ర్‌. 2019  ఆగ‌స్టు 23 నుంచి 2022 అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ర‌క్ష‌ణ‌శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌తో పాటు ఇత‌ర ప‌రీక్ష‌ల‌ను యూపీఎస్సీ నిర్వ‌హించే విష‌యం తెలిసిందే. యూపీఎస్సీకి ఓ ఛైర్మ‌న్, 10 మంది స‌భ్యులు ఉంటారు. ప్రస్తుతం కమిషన్‌లో ఇద్దరు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇక‌, యూపీఎస్సీ ఛైర్మ‌న్‌ను ఆరేళ్ల కోసం అపాయింట్ చేస్తారు. లేదా ఆ వ్య‌క్తి వ‌య‌సు 65 ఏళ్లు దాట‌కుండా ఉండాలి.
Ajay Kumar
UPSC Chairman
Union Public Service Commission
Former Defence Secretary
IAS Officer
Kerala Cadre
President Droupadi Murmu
Appointments
Government of India
UPSC Exams

More Telugu News