Justice B R Gavai: 52వ సీజేగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం.. తొలి బౌద్ధ మతస్థుడిగా రికార్డు

ustice B R Gavai Sworn in as 52nd CJI
    
భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (బి.ఆర్. గవాయి) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ నియామకంతో జస్టిస్ గవాయి భారతదేశానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినట్టయింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథ్యం వహించనున్న జస్టిస్ గవాయి నియామకంలో ఒక చారిత్రక విశేషం ఉంది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన తొలి బౌద్ధ మతస్థుడిగా ఆయన గుర్తింపు పొందారు.  
Justice B R Gavai
Chief Justice of India
CJI
52nd Chief Justice of India
Justice Gavai
Droupadi Murmu
Indian Judiciary
First Buddhist CJI
Supreme Court of India

More Telugu News