Gaurav Jaisingh: బహమాస్ టూర్‌‌ లో విషాదం.. భారత సంతతి విద్యార్థి మృతి

Indian Student Dies in Bahamas Hotel Balcony Fall
  • స్నేహితులతో కలిసి ట్రిప్ కు వెళ్లిన ఇండియన్ అమెరికన్
  • హోటల్ బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడ్డ గౌరవ్
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి
అమెరికాలో చదువుకుంటున్న భారత సంతతి విద్యార్థి ఒకరు ప్రమాదవశాత్తూ బహమాస్ లో చనిపోయాడు. గౌరవ్ జైసింగ్ అనే ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదం చోటుచేసుకుంది. హోటల్ బాల్కనీలో పచార్లు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. తీవ్రగాయాలపాలైన జైసింగ్ ను అతడి స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే జైసింగ్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

మసాచు సెట్స్‌లోని బెంట్లీ యూనివర్సిటీలో జైసింగ్ చదువుతున్నాడు. ఈ వారంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తికావాల్సి ఉంది. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి బహమాస్ టూర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. బహమాస్‌లో వారు బస చేసిన హోటల్‌ బాల్కనీలో పచార్లు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాదకర సంఘటనపై బెంట్లీ యూనివర్సిటీ స్పందిస్తూ.. జైసింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. జైసింగ్ కుటుంబసభ్యులకు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
Gaurav Jaisingh
Indian Student Death
Bahamas
Bentley University
Massachusetts
Accidental Death
Hotel Balcony Fall
Tragedy
Graduation Trip
US Student

More Telugu News