Suresh Babu: వైసీపీకి మ‌రో భారీ షాక్‌.. క‌డ‌ప మేయ‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గింపు

Kadapa Mayor Suresh Babu Removed from Post
  • ఏపీలో ప్ర‌తిప‌క్ష వైసీపీకి వ‌రుస షాక్‌లు 
  • వైసీపీ నేత‌, క‌డ‌ప మేయ‌ర్ సురేశ్‌బాబుపై ఏపీ ప్ర‌భుత్వం అన‌ర్హ‌త వేటు
  • అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు
ఏపీలో ప్ర‌తిప‌క్ష వైసీపీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. తాజాగా వైసీపీ నేత‌, క‌డ‌ప మేయ‌ర్ సురేశ్‌బాబుపై ఏపీ ప్ర‌భుత్వం అన‌ర్హ‌త వేటు వేసింది. అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌ను మేయ‌ర్ ప‌ద‌వి నుంచి తొలిగించింది. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో పాటు ఎమ్మెల్యే రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వి రెడ్డిని అవమానించ‌డం, కుటుంబ స‌భ్యుల‌కు అక్ర‌మంగా కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్ట‌డంపై గ‌త మార్చి 24న సురేశ్‌బాబుకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 

ఇప్ప‌టికే ఆయ‌న‌పై రూ. 35ల‌క్ష‌ల మేర అవినీతికి పాల్పడినట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తేడాది డిసెంబ‌ర్ 23న ఏడుగురు వైసీపీ కౌన్సిల‌ర్లు టీడీపీలో చేరారు. అయితే, వారిని సురేశ్‌బాబు స‌స్పెండ్ చేయ‌డం తీవ్ర రాజ‌కీయ దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం ఆయ‌న‌ను విజిలెన్స్ నివేదిక ఆధారంగా మేయ‌ర్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Suresh Babu
Kadapa Mayor
YCP
Andhra Pradesh Politics
Corruption Allegations
Dismissal from Post
AP Government
Reddappagari Madhavi Reddy
Show Cause Notice
Political Crisis

More Telugu News