Imran Khan: పాక్ డెత్ సెల్‌లో ఉన్న మా నాన్న‌ను కాపాడండి ప్లీజ్‌.. ట్రంప్‌కు ఇమ్రాన్ ఖాన్ కుమారుల అభ్య‌ర్థ‌న‌

Imran Khans Sons Plead with Trump for Fathers Release from Death Cell
    
పాకిస్థాన్ డెత్ సెల్‌లో ఉన్న త‌మ తండ్రిని కాపాడాలని మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభ్య‌ర్థించారు. త‌మ తండ్రిని విడిపించాల‌ని తాము ట్రంప్‌ను కోర‌తామ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ కొడుకులు సులైమాన్ ఖాన్‌, కాసిమ్ అన్నారు. ఎందుకంటే త‌మ తండ్రికి క‌నీస హ‌క్కులు ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా వారు పేర్కొన్నారు.   

త‌మ తండ్రి ఇమ్రాన్ ఖాన్ డెత్‌సెల్ లో ఉన్నార‌ని వారు వాపోయారు. జైల్లో ఆయ‌న‌ను ఉంచిన సెల్‌లో క‌నీసం లైట్ కూడా లేద‌న్నారు. ఆయ‌న‌పై న‌మోదైన కేసులను ప‌రిశీలిస్తే రాజ‌కీయ కుట్రపూరిత‌మైన‌వ‌ని తేలిపోతుంద‌ని అన్నారు. త‌మ తండ్రిని విడిపించుకునేందుకు ప్ర‌జాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యాన్ని స‌మ‌ర్థించే ఏ ప్ర‌భుత్వాన్ని అయినా మ‌ద్ద‌తు కోరుతామ‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా వ‌ర‌ల్డ్‌లోనే మోస్ట్ పాప్యుల‌ర్ లీడ‌ర్ అయిన ట్రంప్‌ను సాయం కోర‌తామ‌ని చెప్పుకొచ్చారు.   
Imran Khan
Imran Khan sons
Donald Trump
Pakistan death cell
political case
human rights violation
Sulaiman Khan
Qasim Khan
Pakistan politics
US intervention

More Telugu News