Vivek Agnihotri-Anurag Kashyap: వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్యప్ మధ్య పేలుతున్న మాటల తూటాలు

- కశ్యప్ తాగుబోతు అంటూ వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు
- ఈ మనిషి ఎంత అబద్ధాలకోరు అంటూ వివేక్ పై కశ్యప్ ఫైర్
- ఈ నటన ఆపాలి అంటూ ఆగ్రహం
ప్రముఖ బాలీవుడ్ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్యప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 'ధన్ ధనా ధన్ గోల్' సినిమా చిత్రీకరణ సమయంలో అనురాగ్ కశ్యప్ ప్రవర్తనపై వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు చేయగా, వాటిని అనురాగ్ కశ్యప్ తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివేక్ అగ్నిహోత్రి ఆరోపణలు ఇవే...
'ధన్ ధనా ధన్ గోల్'చిత్రానికి జాన్ అబ్రహం, బిపాషా బసు ప్రధాన పాత్రధారులు కాగా, వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్, రోహిత్ మల్హోత్రాతో కలిసి డైలాగ్స్ రాశారు. విక్రమాదిత్య మోత్వానీ స్క్రీన్‌ప్లే అందించారు. తాజాగా ఓ డిజిటల్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, "గోల్ సినిమా సమయంలో అనురాగ్ కశ్యప్‌తో కలిసి పనిచేశాను. మొదట సైఫ్ అలీ ఖాన్, ప్రియాంక చోప్రా ఈ సినిమా చేయాల్సి ఉండగా, సైఫ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. తర్వాత జాన్, బిపాషా వచ్చారు. ఆ సమయంలో అనురాగ్ ఎక్కువగా మద్యం సేవించేవాడు, సమయపాలన ఉండేది కాదు" అని ఆరోపించారు.
అంతేకాకుండా, "అనురాగ్ తరువాత విక్రమాదిత్య మోత్వానీని తీసుకొచ్చి, ఇతను సహాయం చేస్తాడని చెప్పాడు. నెమ్మదిగా మొత్తం పని విక్రమాదిత్యకే అప్పగించాడు. నేను తీయాలనుకున్నదానికి, వాళ్ల ఆలోచనలకు పొంతన కుదరలేదు. చివరికి మా మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ప్రొడక్షన్ హౌస్ అనురాగ్‌తో మాట్లాడింది... అనురాగ్‌ను నియంత్రించడం కష్టంగా మారింది. ఎందుకంటే ఒక తాగుబోతు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో మరో తాగుబోతుకే తెలుస్తుంది. అది పెద్ద సమస్యగా మారింది" అని వివేక్ వివరించారు.
వివేక్ ఆరోపణలను ఖండించిన అనురాగ్ కశ్యప్
వివేక్ అగ్నిహోత్రి చేసిన తీవ్ర ఆరోపణలపై అనురాగ్ కశ్యప్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఘాటుగా స్పందించారు. "ఈ మనిషి ఎంత అబద్ధాలకోరు! సినిమా షూటింగ్ లండన్‌లో జరిగింది. నేను అప్పుడు ఇండియాలో ఉన్నాను. మోత్వానీ రాసిన స్క్రిప్ట్ గానీ, నా స్క్రిప్ట్ గానీ ఆయనకు నచ్చలేదు. ఆయన ఫుట్‌బాల్ నేపథ్యంలో 'లగాన్' లాంటి సినిమా తీయాలనుకున్నారు. దానికోసం తన సొంత రచయితను పెట్టుకుని ఆ చెత్త స్క్రిప్ట్ రాయించుకున్నారు. నేనూ గానీ, మోత్వానీ గానీ ఎప్పుడూ సెట్‌కు వెళ్లలేదు. ఈ నటన ఆపండి వివేక్ అగ్నిహోత్రి!" అని కశ్యప్ పోస్ట్ చేశారు. విక్రమాదిత్య మోత్వానీ కూడా ఈ స్టోరీని రీ-షేర్ చేస్తూ అనురాగ్‌కు మద్దతు తెలిపారు.
'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్', 'బ్లాక్ ఫ్రైడే', 'అగ్లీ' వంటి విజయవంతమైన చిత్రాలతో అనురాగ్ కశ్యప్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 'ధన్ ధనా ధన్ గోల్' చిత్రంలో జాన్ అబ్రహం, బిపాషా బసు, అర్షద్ వార్సీ, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని యూటీవీ మోషన్ పిక్చర్స్ పతాకంపై రోనీ స్క్రూవాలా నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకుల మధ్య రాజుకున్న వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.