Mukesh Ambani: ట్రంప్‌ను క‌లిసిన ముఖేశ్‌ అంబానీ.. ఇదిగో వీడియో!

Mukesh Ambani Meets Donald Trump in Qatar Video Goes Viral
      
ఖ‌త‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముఖేశ్‌ అంబానీ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఖ‌త‌ర్ లుసైల్ ప్యాలెస్‌లో నిర్వ‌హించిన విందులో ట్రంప్‌తో పాటు ఖ‌త‌ర్ షేక్ ఎమిర్ త‌మిమ్ బిన్ హమీద్‌తోనూ ముచ్చ‌టించారు. 

ఈ సంద‌ర్భంగా ట్రంప్‌తో ప‌లు అంశాల‌పై అంబానీ కాసేపు చ‌ర్చించారు. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక‌, ఈ వీడియోలో రిలయన్స్ చీఫ్ అమెరికా వాణిజ్య కార్యదర్శి స్టీవ్ లుట్నిక్‌తో అంబానీ స్నేహపూర్వకంగా సంభాషించ‌డం కూడా ఉంది. 

కాగా, అమెరికా అధ్య‌క్షుడి గౌర‌వార్థం ఖ‌త‌ర్ స‌ర్కార్ ఏర్పాటు చేసిన ఈ అధికారిక విందులో టెస్లా అధినేత మ‌స్క్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. 

జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్‌తో అంబానీ ఇది రెండవ సమావేశం. జనవరిలో ట్రంప్ రెండవ ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు ముఖేశ్‌ అంబానీ, ఆయ‌న‌ భార్య నీతా అంబానీ ట్రంప్‌ను కలిశారు.
Mukesh Ambani
Donald Trump
Qatar
reliance industries
US President
Business Meeting
Viral Video
Ambani Trump Meeting
Steve Mnuchin
Elon Musk

More Telugu News