AP Ration Card: కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేశారా..? అయితే స్టేటస్ సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి!

- ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ
- దరఖాస్తు తర్వాత... ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలన
- ఈ మూడు దశలు పూర్తి కావడానికి 21 రోజుల వరకు సమయం
- ఈ క్రమంలో దరఖాస్తుల పురోగతిని ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత... ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. ఈ మూడు దశలు పూర్తి కావడానికి 21 రోజుల వరకు సమయం పడుతుంది. ఈ క్రమంలో దరఖాస్తుల పురోగతి (స్టేటస్)ని ఆన్ లైన్‌లో ఈజీగా చూసుకునే వెసులుబాటును దరఖాస్తుదారులకు కూటమి సర్కార్ కల్పించింది.
దరఖాస్తుల స్టేటస్ సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోవచ్చు!
దరఖాస్తుల స్టేటస్ సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోవచ్చు!
- https://vswsonline.ap.gov.in/వెబ్ సైట్లో లాగిన్ అయితే.. ఏపీ సేవా అధికారిక పోర్టల్ వస్తుంది.
- అందులో కుడి వైపున పైన సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే సెర్చ్ కాలమ్ ఉంటుంది.
- అందులో రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో వచ్చిన సంఖ్య నమోదు చేయాలి.
- ఆ తర్వాత ఓ కోడ్ వస్తుంది.
- ఆ వివరాలు అందులో పొందుపరిస్తే... రేషన్ కార్డు దరఖాస్తు ఏ అధికారి దగ్గర ఉందో తెలిసిపోతుంది. అలాగే ప్రక్రియ పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అనే వివరాలు కూడా అందులో కనిపిస్తాయి.