Sanjeev Goenka: తిరుమ‌ల శ్రీవారికి సంజీవ్ గోయెంకా భారీ విరాళం

Sanjeev Goenkas Huge Donation to Tirumala Temple
  • రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు స్వామివారికి విరాళం
  • దాదాపు ఐదు కిలోల బంగారంతో చేయించిన క‌టి హ‌స్తం, వ‌ర‌ద హ‌స్తాలు
  • ఐపీఎల్ లో ల‌క్నో జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గోయెంకా
తిరుమ‌ల శ్రీవారికి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ఐపీఎల్ ఫ్రాంచైజీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ ) య‌జ‌మాని సంజీవ్ గోయెంకా భారీ విరాళం అంద‌జేశారు. రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వామివారికి బ‌హూక‌రించారు. దాదాపు ఐదు కిలోల బంగారంతో చేయించిన క‌టి హ‌స్తం, వ‌ర‌ద హ‌స్తాల‌ను టీటీడీ అద‌న‌పు ఈఓ వెంక‌య్య చౌద‌రికి అందించారు.  

ఇక‌, ఐపీఎల్‌లో ఎల్ఎస్‌జీ ఫ్రాంచైజీ ఓన‌ర్ అయిన గోయెంకా గ‌తేడాది జ‌రిగిన మెగా వేలంలో రిష‌భ్ పంత్ ను ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా రూ.27 కోట్ల‌కు కొనుగోలు చేసి రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. కానీ, ఈ సీజ‌న్‌లో పంత్ అందుకుత‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక చతికిలప‌డ్డాడు. 

ఒక‌వైపు కెప్టెన్సీ, మ‌రోవైపు టోర్నీలోనే కాస్ట్లీ ప్లేయ‌ర్ అనే ట్యాగ్‌తో మ‌నోడు త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేద‌నే చెప్పాలి. ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడిన ల‌క్నో జ‌ట్టు ఐదు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల‌లో గెలిచినా జ‌ట్టు ప్లేఆఫ్స్ అవ‌కాశాలు అంత సులువు కాదు. 

Sanjeev Goenka
Tirumala Tirupati Devasthanams
TTD
IPL
Lucknow Super Giants
Rishabh Pant
Donation
Gold Ornaments
Businessman
Cricket

More Telugu News