KTR: కేటీఆర్‌కు బ్రిటన్ నుంచి మరో ఆహ్వానం

KTR Receives Another Invitation from Britain
  • ఇంతకు ముందు లండన్ లోని బ్రిడ్జ్ ఇండియా సంస్థ నుంచి కేటీఆర్‌కు అహ్వానం
  • తాజాగా లండన్ లోని ప్రముఖ ఆటో మొబైల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ నుంచి కేటీఆర్‌కు అహ్వానం
  • ఈ నెల 30న వార్విక్ యూనివర్శిటీ సైన్స్ పార్క్‌లోని పరిశోధనా కేంద్రాన్ని ప్రాంభించనున్న కేటీఆర్‌  
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. బ్రిటన్‌లో జరిగే ఐడియాస్ ఫర్ ఇండియా - 2025 సదస్సుకు రావాలంటూ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఈ ఏడాది మార్చి నెలలో కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు మే 30న లండన్‌లోని రాయల్ లాంకాస్టర్ హోటల్‌లో జరిగే సదస్సుకు కేటీఆర్ ముఖ్య వక్తగా వెళ్లనున్నారు.

తాజాగా లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రోగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్) యూకేలోని వార్విక్ టెక్నాలజీ ఫార్మ్‌లో ఏర్పాటు చేసిన తమ నూతన కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు మే 30న కేటీఆర్ వార్విక్ యూనివర్సిటీ సైన్స్ పార్క్‌లోని పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ రంగాల పట్ల కేటీఆర్ వినూత్నమైన దృక్పథం, అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాల స్థాపన, ఇన్నోవేషన్ ప్రోత్సాహానికి ఆయన పెట్టిన కృషి తమ సంస్థ విధానాలకు అనుగుణంగా ఉందని, ఆయన చేతుల మీదుగా తమ కేంద్రం ప్రారంభించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నామని సంస్థ డైరెక్టర్ క్రాంతి పుప్పాల పేర్కొన్నారు. 
KTR
KTR UK visit
KTR London
Ideas for India 2025
Pragmatic Design Solutions Limited
Warwick University
Innovation
Research
India-UK relations
Telangana Politics

More Telugu News