Dola Sri Bala Veerajaneya Swami: దివ్యాంగుల సర్టిఫికెట్ల జారీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

AP Govts Key Decision on Issuing Disability Certificates
  • దివ్యాంగులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్న మంత్రి డోలా 
  • మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా సదరం స్లాట్ బుకింగ్‌కి చర్యలు
  • స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి
దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. అమరావతి వెలగపూడి సచివాలయంలో శుక్రవారం దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సదరం సర్టిఫికెట్లు, పీఎంజేఏవై వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్‌పై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.... గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్‌కు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.

దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ గుర్తింపు కార్డులో అంగవైకల్య శాతం, దివ్యాంగుల వివరాలు ఉంటాయన్నారు. గుర్తింపు కార్డులు తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పీఎంజేఎవై వందన స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు. 
Dola Sri Bala Veerajaneya Swami
Andhra Pradesh
Disability Certificates
AP Government
Social Welfare Department
Disability Cards
PMJAY Vandana Yojana
Elderly Healthcare
Government Schemes
Accessibility

More Telugu News