Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్... రాజమౌళికి నో.. ఆమిర్ ఖాన్‌కు ఓకే!

- హాట్ టాపిక్‌గా మారిన 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్
- బయోపిక్ కోసం ఆమిర్ ఖాన్, దర్శక ధీరుడు రాజమౌళి పోటీ
- ఈ ప్రాజెక్టు జక్కన్న చేస్తున్నారన్న వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆమిర్ నుంచి కూడా ప్రకటన
- తాజాగా స్పందించిన ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ
- తనను రాజమౌళి బృందం సంప్రదించలేదని వెల్లడి
- ఆమిర్ బృందం ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగేళ్లుగా పనిచేస్తోందని వ్యాఖ్య
- ఈ బయోపిక్‌లో ఆమిర్ నటిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టీకరణ
ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ బయోపిక్ చేసేందుకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, దర్శక ధీరుడు రాజమౌళి పోటీ పడుతున్నారు. ఈ ప్రాజెక్టు జక్కన్న చేస్తున్నారన్న వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆమిర్ నుంచి కూడా ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.
జక్కన్న సమర్పణలో ఫాల్కే బయోపిక్ ప్రాజెక్టును 'మేడ్ ఇన్ ఇండియా' అనే పేరుతో తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేగాక ఈ మూవీని జక్కన్న తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించనున్నారని, నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో జూనియర్ ఎన్‌టీఆర్ నటించనున్నట్లు టాక్ వచ్చింది.
తాజాగా ఈ స్టోరీని తారక్‌కు వినిపించగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్‌టీఆర్ ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ఈ స్టోరీలో భారతీయ సినిమా పుట్టుక.. అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపనున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
అయితే, ఈ వార్తలు వచ్చిన వెంటనే ఆమిర్ ఖాన్ సైతం 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్‌ను అనౌన్స్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించనుండగా.. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
రాజ్ కుమార్ హిరాణీ, అభిజిత్ జోషీ, హిందూకుశ్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్‌లు ఈ బయోపిక్ కోసం నాలుగేళ్లుగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. 'సితారే జమీన్ పర్' రిలీజైన వెంటనే ఈ బయోపిక్ కోసం ఆమిర్ సిద్ధం కానున్నారని.. ఈ ఏడాది అక్టోబరులోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.
ఇలా టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు పోటాపోటీగా ప్రకటనలు చేయడంతో ఇప్పుడు ఫాల్కే బయోపిక్ అసలు ఎవరు తెరకెక్కిస్తారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందించారు. తనను రాజమౌళి బృందం సంప్రదించలేదని, ఆమిర్ బృందం ఈ ప్రాజెక్ట్ విషయమై నాలుగేళ్లుగా పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రశేఖర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ... "ఈ ప్రాజెక్ట్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో రానున్నట్లు వస్తోన్న వార్తలు నేనూ విన్నాను. కానీ, ఆయన, ఆయన బృందం నాతో ఇప్పటివరకూ మాట్లాడింది లేదు. ఫాల్కేపై ఎవరైనా సినిమా తీయాలంటే కనీసం కుటుంబసభ్యులతోనైనా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన గురించి మాకే ఎక్కువ తెలుస్తుంది.
ఆమిర్-రాజ్ కుమార్ హిరాణీ టీమ్ మాతో ఎన్నోసార్లు చర్చలు జరిపింది. వాళ్ల అసిస్టెంట్ ప్రొడ్యూసర్ నాతో మూడేళ్లుగా టచ్‌లో ఉన్నారు. నాలుగేళ్లుగా వాళ్లు ఈ ప్రాజెక్ట్‌పై నిజాయతీగా పనిచేస్తున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఫాల్కేగా ఆమిర్ నటించడం ఆనందంగా ఉంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు, నియబద్ధతతో పని చేస్తారు. అలాగే చిత్రంలో ఫాల్కే భార్య సరస్వతిబాయ్ ఫాల్కే పాత్రకు నటి విద్యాబాలన్‌ను తీసుకుంటే బాగుంటుంది" అని అన్నారు.