War 2: ‘వార్-2’పై మైత్రీ మూవీ మేక‌ర్స్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌.. అభిమానుల‌కు ఒకింత నిరాశ క‌లిగించే న్యూస్‌!

NTRs Birthday Update Disappointment for Fans as NTR 31 Update Postponed
  • ఈ నెల 20న పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్న ఎన్‌టీఆర్‌
  • ‘వార్-2’ నుంచి తార‌క్‌ బ‌ర్త్‌డే నాడు స్పెష‌ల్ అప్‌డేట్ 
  • తార‌క్-ప్రశాంత్ నీల్ కాంబోలో వ‌స్తున్న ప్రాజెక్ట్ నుంచి నో అప్‌డేట్‌
  • ‘వార్-2’ కోసం తాము వెన‌క్కి త‌గ్గుతున్నామ‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌ట‌న‌
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ నెల 20న‌ త‌న పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్.. అత‌డి సినిమాల అప్‌డేట్‌ల కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే తార‌క్ న‌టిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘వార్-2’ నుంచి బ‌ర్త్‌డే నాడు స్పెష‌ల్ అప్‌డేట్ ఉండ‌బోతుంద‌ని అటు హృతిక్ రోష‌న్‌తో పాటు ఇటు చిత్ర‌నిర్మాణ సంస్థ య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ ప్ర‌క‌టించాయి. 

అయితే, ‘వార్-2’తో పాటు తార‌క్-ప్రశాంత్ నీల్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ప్రాజెక్ట్‌కు సంబంధించి కూడా అప్‌డేట్ వ‌స్తుంద‌ని అంద‌రూ ఊహించారు. కానీ, ఎన్‌టీఆర్ బ‌ర్త్‌డే నాడు ఈ మూవీ నుంచి ఎటువంటి అప్‌డేట్ ఉండ‌ద‌ని నిర్మాణ సంస్థ తాజాగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌కటించింది. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.

“ఇది పూర్తిగా ‘వార్-2’ సమయం. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు. దీన్ని (WAR 2) సెలబ్రేట్ చేసుకుందాం. మన మాస్ మిస్సైల్‌ను సరైన సమయంలో విడుదల చేద్దాం. ఈ పుట్టినరోజును ‘వార్-2’తో చేసుకోండి” అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది. 

ఈ పోస్ట్ ద్వారా మైత్రీ మూవీ మేకర్స్... తార‌క్‌-ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఉండదని స్పష్టం చేసింది. ‘వార్-2’ విడుదల సమయంలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, తమ సినిమాకు సంబంధించిన మాస్ అప్‌డేట్‌ను సరైన సమయం వచ్చినప్పుడు అందిస్తామని పరోక్షంగా తెలిపింది.

ఇక‌, హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ‘వార్-2’ రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా... అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్ డే రోజున గ్లింప్స్ విడుద‌ల‌ చేయనున్నట్లు స‌మాచారం.
War 2
NTR
Jr NTR
Hrithik Roshan
NTR 31
Prashanth Neel
Yash Raj Films
Telugu Cinema
Bollywood
Pan India Movie

More Telugu News