Sajjanar: పట్టు తప్పితే ప్రమాదం తప్పదు.. సజ్జనార్ ట్వీట్

––
ట్రాఫిక్ పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కొంతమంది వాహనదారులు మాత్రం మారడంలేదు. ప్రమాదకరమని తెలిసినా వెనకాడడంలేదు. నగరంలో ఏదో ఒక ప్రాంతంలో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. తాజాగా ట్విట్టర్ లో ఓ ఫొటో పంచుకున్న సజ్జనార్.. ‘‘ప్రమాదమని తెలిసి కూడా కొందరు ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నారు. సమయం ఆదా చేయాలనో, గమ్యస్థానం త్వరగా చేరుకోవాలనే తాపత్రయమో.. కారణం ఏదైనా ఇలా ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటమాడడమే. అనుకోని ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తించడం లేదు ప్రమాదపుటంచున ప్రయాణం వద్దు. మీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వండి” అని వ్యాఖ్యానించారు.