Sriram Reddy: 2017 నాటి కేసు.. మంత్రి శ్రీధర్ బాబుపై కేసు కొట్టివేత

Minister Sriram Reddys Case Dismissed by Nampally Court
  • కాళేశ్వరం భూ సేకరణ వివాదం కేసులో మంత్రి శ్రీధర్‌బాబుకు ఊరట
  • శ్రీధర్‌బాబు సహా 13 మందిపై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు
  • 2017లో కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేసిన గత ప్రభుత్వం
  • న్యాయమే గెలిచిందని, ఇది రైతుల విజయమని శ్రీధర్‌బాబు వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుకు కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన వివాదంలో నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆయనతో పాటు మరో 12 మంది కాంగ్రెస్ నాయకులపై 2017లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ, ఇది రైతుల విజయమని, చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.

2017లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూసేకరణపై ప్రజా విచారణ జరుగుతున్న సమయంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన తాము నిలిచామని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. "రైతుల హక్కులను కాపాడాలని, వారికి న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే, అప్పటి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాపై వివిధ సెక్షన్ల కింద కేసులు బనాయించింది" అని ఆయన వివరించారు.

దాదాపు ఎనిమిదేళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగిందని, తాజాగా నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేయడం సంతోషకరమని శ్రీధర్‌బాబు తెలిపారు. "ఇది ప్రజా విజయం, రైతుల విజయం. పేద రైతుల ఆవేదనను న్యాయస్థానం ఆలకించింది. నాడు అధికారం చేతిలో ఉందని మాపై అక్రమంగా కేసులు పెట్టారు, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు" అని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఉందని, తాము చట్టాలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. "మాకు అధికారం ఉందని ఎక్కడా దాన్ని దుర్వినియోగం చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత కూడా సరిగా లేదు. దానిపై విచారణ జరుగుతోంది. తప్పు చేసిన వారు ఎవరైనా సరే, చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే" అని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.
Sriram Reddy
Minister Sriram Reddy
Kaleshwaram Project
Land Acquisition Case
Nampally Court
Telangana Politics
Congress Leaders
Farmer's Rights
Telangana Minister
Case Dismissal

More Telugu News