IPL: ఐపీఎల్ రీస్టార్ట్ కు వాన దెబ్బ... బెంగళూరులో మ్యాచ్ ఆలస్యం

- ఇటీవల ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ కారణంగా ఐపీఎల్ వాయిదా
- నేడు పునఃప్రారంభం
- బెంగళూరులో ఆర్సీబీ × కేకేఆర్
- వర్షంతో తడిసి ముద్దయిన చిన్నస్వామి స్టేడియం
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదితర పరిస్థితుల కారణంగా ఐపీఎల్-2025 సీజన్ కొన్ని రోజుల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పరిస్థితులు సద్దుమణగడంతో ఐపీఎల్ నేడు పునఃప్రారంభం అవుతోంది. బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడాల్సి ఉండగా... వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అవుతోంది. ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. వర్షం కారణంగా ఇక్కడి చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దవడంతో అంపైర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.