Andy Beshear: అమెరికాలో టోర్నడోల విలయం... 21 మంది మృతి

21 Dead in US Tornado Outbreak
  • కెంటరీ, మిస్సోరీ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన టోర్నడోలు
  • మిస్సోరీలో ధ్వంసమైన ఐదు వేల భవనాలు
  • దాదాపు లక్ష నివాసాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం  
అమెరికాలో పెను తుపాన్ బీభత్సం సృష్టించడంతో 21 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా కెంటకీ, మిస్సోరీ రాష్ట్రాల్లో టోర్నడోలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కెంటకీ రాష్ట్రంలో 14 మంది, మిస్సోరీ రాష్ట్రంలో ఏడుగురు మృతి చెందారు. కెంటకీలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బేషియర్ పేర్కొన్నారు.

కెంటకీలోని లారెల్ కౌంటీలో టోర్నడో కారణంగా తొమ్మిది మంది మరణించారని అధికారులు వెల్లడించారు. అనేక మంది గాయపడ్డారని, ఆస్తినష్టం కూడా భారీగా సంభవించిందని తెలిపారు. మిస్సోరీలో ఐదు వేల భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడి సెయింట్ లూయిలో ఐదుగురు మృతి చెందగా, దాదాపు లక్ష నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

ఇల్లినోయీలో కూడా టోర్నడోలు బీభత్సం సృష్టించినట్లు యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 
Andy Beshear
Tornadoes
Kentucky
Missouri
Illinois
US National Weather Service
Tornado damage
Midwest Tornadoes
American Tornadoes
Death Toll

More Telugu News