Tirumala: తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం

Tirumala Temple Sees Surge in Devotees 24 Hour Wait for Darshan
  
తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. టోకెన్లు లేని భ‌క్తుల స‌ర్వ‌ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. స‌ర్వ‌ద‌ర్శ‌నం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్ల‌న్నీ భ‌క్తుల‌తో నిండిపోయాయి. స్వామివారి స‌ర్వ‌ద‌ర్శనానికి కృష్ణ‌తేజ అతిథి గృహం వ‌ర‌కు భ‌క్తులు వేచి ఉన్నారు. 

ఇక‌, శ‌నివారం 87,347 మంది స్వామివారిని ద‌ర్శించుకున్నారు. 39,490 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వ‌చ్చింద‌ని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు. కాగా, ఇవాళ తెల్ల‌వారుజామున భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల‌కు వ‌చ్చారు. శ్రీవారిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  
Tirumala
Sri Venkateswara Swamy
Tirupati Balaji
Temple Darshan
Andhra Pradesh
India
Gautam Gambhir
TTD
long waiting times
increased devotees

More Telugu News