Nandigam Suresh: టీడీపీ నేతపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడి

- ఉద్దండ్రాయునిపాలెంలో ఘటన
- రాజు అనే స్థానిక టీడీపీ నేతపై సురేశ్, ఆయన సోదరుడు ప్రభుదాసు దాడి
- తీవ్రంగా గాయపడ్డ రాజు మంగళగిరిలోని ఎయిమ్స్‌లో చికిత్స
- బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి ఘటన
టీడీపీ నేతపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడికి పాల్పడ్డారు. ఉద్దండ్రాయునిపాలెంలో రాజు అనే స్థానిక టీడీపీ నేతపై నందిగం సురేశ్, ఆయన సోదరుడు ప్రభుదాసు శనివారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజు మంగళగిరిలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన బయటకు వచ్చింది. కాగా, అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ దాదాపు మూడు నెలలు జైలులో ఉన్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడు టీడీపీ నేతపై దాడితో మరోసారి వార్తల్లో నిలిచారు.