Moeen Ali: 'ఆప‌రేష‌న్ సిందూర్' స‌మ‌యంలో నా పేరెంట్స్ పీఓకేలోనే ఉన్నారు: మొయిన్ అలీ

Moeen Alis Parents in POK During Operation Sundar
  • ప‌హల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్
  • పీఓకేతో పాటు పాక్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో మెరుపు దాడులు 
  • ఈ ఆప‌రేష‌న్ స‌మ‌యంలో చాలా ఆందోళ‌న‌కు గుర‌య్యాన‌న్న ఇంగ్లండ్ క్రికెట‌ర్‌
  • పీఓకేలోనే త‌న పేరెంట్స్ ఉండ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని ఆందోళ‌న‌
  • తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆరోజును గుర్తు చేసుకున్న మొయిన్ అలీ
ఏప్రిల్ 22న ప‌హల్గామ్ ఉగ్ర‌దాడిలో 26 మంది ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ పాశ‌విక దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఆక్ర‌మిత కశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్థాన్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో మిస్సైల్స్‌తో మెరుపు దాడులు నిర్వ‌హించింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్ర‌వాదులు మృతిచెందారు. 

అయితే, ఈ ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో త‌న పేరెంట్స్ పీఓకేలోనే ఉన్నార‌ని ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ప్లేయ‌ర్ మొయిన్ అలీ తాజాగా వెల్ల‌డించాడు. ఆ స‌మ‌యంలో చాలా ఆందోళ‌నకు గుర‌య్యాన‌ని తెలిపాడు. ఆ క్ష‌ణాలు చాలా క‌ఠినంగా గ‌డిచాయ‌ని పేర్కొన్నాడు. ఈమేర‌కు తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆ రోజును గుర్తు చేసుకున్నాడు.
Moeen Ali
Operation Sundar
POK
Pakistan
India
Parents
Terrorist Attack
Pulwama Attack
Cricket
Kolkata Knight Riders

More Telugu News