Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో తప్పిన పెను ప్రమాదం .. 300 ట్రక్కుల ద్రవ ఉక్కు నేలపాలు

Visakhapatnam Steel Plant Avoids Major Disaster
  • విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ - 2 లో ప్రమాదం
  • కాలిపోయిన కేబుల్స్, దెబ్బతిన్న ట్రాక్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కర్మాగారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్లాస్ట్ ఫర్నెస్ - 2లో సుమారు 300 ట్రక్కుల ద్రవ ఉక్కు నేలపాలైంది. ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్ కార్ (టీఎల్‌సీ)లోకి ద్రవ ఉక్కు నింపి, ఎస్ఎంఎస్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఒక్కసారిగా టీఎల్‌సీకి రంధ్రం పడి ద్రవ ఉక్కు కింద పడిపోయింది.

దీంతో మంటలు చెలరేగి కేబుల్స్ కాలిపోయి, ట్రాక్ దెబ్బతింది. అయితే, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంపై స్టీల్ ఇంటర్ అధ్యక్షుడు పి.వి. రమణమూర్తి, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి యు. రామస్వామి స్పందిస్తూ, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిపుణులైన సిబ్బందితో పనులు చేయించాలని డిమాండ్ చేశారు. 
Visakhapatnam Steel Plant
Steel Plant Accident
Liquid Steel Spill
Industrial Accident
Visakhapatnam
PV Ramana Murthy
Y Ramaswamy
Safety Concerns
Blast Furnace

More Telugu News