Nandigama Suresh: నందిగం సురేశ్ కు రిమాండ్

Nandigam Suresh Sent to Remand
  • జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు
  • గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్న పోలీసులు
  • టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో నందిగం సురేశ్ అరెస్టు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడి కేసులో అరెస్టైయిన మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 2 వరకు నందిగం సురేశ్ కు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. 

నందిగం సురేశ్ ను ఆదివారం ఉదయం అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఉదయం మంగళగిరి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టు ప్రాంగణానికి భారీగా చేరుకున్న నందిగం సురేశ్ అనుచరులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఇతరులు ఎవరినీ కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు.
Nandigama Suresh
Remand
Court
Arrest
TDP
YSRCP
Attack Case
Mangalagiri Court
Former MP
Guntur Jail

More Telugu News