Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా... పోలీసులకు కోర్టు కీలక ఆదేశాలు

Vallabhaneni Vamsis Bail Plea Hearing Adjourned
  • నకిలీ పట్టాల పంపిణీ కేసు
  • వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన నూజివీడు కోర్టు
  • కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా నకిలీ పట్టాల పంపిణీ కేసులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నూజివీడు కోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు, అక్రమ మైనింగ్ కేసు, నకిలీ పట్టాల కేసు తదితర పలు కేసులు ఉన్నాయి. పలు  కేసుల్లో ఆయనకు బెయిల్/ముందస్తు బెయిల్ లభించింది. మిగిలిన కేసుల్లో బెయిల్ వస్తే కానీ ఆయన జైలు నుంచి విడుదల కాలేరు. 
Vallabhaneni Vamsi
Bail Petition
Nuzvid Court
Forgery Case
Andhra Pradesh Politics
YCP Leader
Vijayawada Sub Jail
Remand Prisoner
Criminal Cases

More Telugu News